News March 22, 2024
వరంగల్: ఉరేసుకుని వాచ్ మెన్ ఆత్మహత్య
హనుమకొండ ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్(45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తలమధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.
Similar News
News September 16, 2024
WGL: గణేశ్ నిమజ్జనం.. చెరువుల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు
గణేశ్ నిమజ్జనాలకు నగరపాలక అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 21 చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. 28 క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రక్షణ చర్యల్లో భాగం అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షల విధించారు.
News September 16, 2024
వరంగల్ : కొడుకు వైద్యానికి డబ్బుల్లేక తండ్రి ఆత్మహత్య
అనారోగ్యం బారిన పడ్డ కొడుకును రక్షించుకోవడానికి డబ్బుల్లేక ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లబెల్లి మండలం గోవిందాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కుంజ సునీల్ (28) అతడి 8 నెలల కుమారుడు 2 నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకు వైద్యం కోసం సునీల్ రూ.7లక్షలు అప్పు చేశాడు. అవి సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సునీల్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
News September 16, 2024
మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ
పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి ఆకాంక్షించారు.