News February 26, 2025
వరంగల్: ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నగరంలోని ములుగురోడ్డు సమీపంలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ విద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత(20) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2025
వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్‌లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News February 27, 2025
వరంగల్ జిల్లాలో ఎంతమంది టీచర్స్ ఓటర్లు అంటే?

వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ MLC ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2352 మంది(పురుషులు 1474, స్త్రీలు 878) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో ఒక్కో మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసామన్నారు.
News February 27, 2025
WGL: డిస్ట్రిబ్యూషన్ సందర్శించిన కలెక్టర్

ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం-నల్లగొండ-ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను బుధవారం కలెక్టర్ సత్యశారద దేవి సందర్శించారు. సామాగ్రి పంపిణీ తీరు కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే పీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు సిబ్బంది తీసుకునే చెక్ లిస్ట్ ప్రకారం పక్కాగా పరిశీలించాలని సూచించారు.