News January 23, 2025
వరంగల్ ఉర్సు ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు

వరంగల్ 469వ మాశుఖే రబ్బానీ రహ్మతుల్లా అలై ఉర్స్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అర్థరాత్రి జరిగిన సందల్ యాత్ర కై పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ ఉర్సు ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరువుతుండటంతో సీసీఎస్, షీ టీం విభాగాలకు చెందిన పోలీసులు ఈ ప్రదేశంలో ప్రత్యేక నిఘా పెట్టారు.
Similar News
News December 10, 2025
ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 10, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ నేటితో జిల్లాలో ముగిసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓ ఎన్నికల సిబ్బంది రేపు రిపోర్ట్ చేయాలి: కలెక్టర్
✓ భద్రాచలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
✓ ముక్కోటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: కలెక్టర్
✓ గుండాల: యువతిని మోసం చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు
✓ ఎన్నికలకు 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: ఎస్పీ
✓ అన్నపురెడ్డిపల్లి: ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ
News December 10, 2025
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.


