News April 11, 2025
వరంగల్ ఎంపీకి ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ లేఖ రాశారు. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ ప్రచురించి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాసేవకు అంకితం కావాలని ఆయన కోరారు.
Similar News
News September 13, 2025
మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.
News September 13, 2025
తిరుపతి SPగా సుబ్బరాయుడు ఘనతలు ఇవే.!

తిరుపతి SPగా సుబ్బరాయడుకు రెండోసారి అవకాశం దక్కింది. మెదటి టర్మ్లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాత్రికుల క్షేమం కోసం నైట్ బీట్లను ముమ్మరం చేయడం, అప్పట్లో సంచలనంగా మారిన ఎర్రవారిపాళ్యం ఫొక్సో కేసులో 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో మహిళా రక్షక్ టీములను ఏర్పాటు చేసిన ఘనత ఈయనదే. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. అప్పట్లో 15 మంది పోలీసులపై సైతం ఆయన చర్యలు తీసుకున్నారు.
News September 13, 2025
ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు బండి పిలుపు

సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. సాయిధ విప్లవ పోరాటాలు కాలం చెల్లినవని, మావోయిస్టులు ఆయుధాలు విడిచి పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజాకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.