News April 11, 2025

వరంగల్ ఎంపీకి ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

image

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ లేఖ రాశారు. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ ప్రచురించి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాసేవకు అంకితం కావాలని ఆయన కోరారు.

Similar News

News March 7, 2026

ప్రగతి ప్రణాళికలో వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్ కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు మొత్తం 99 రోజులపాటు చేపట్టనున్న కార్యాచరణపై కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 7, 2026

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ: డీఐజీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జనవరి 1 నుంచి ఈనెల 6 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఓవర్ స్పీడ్ 1,763 కేసులు, హెల్మెట్ లేకుండా 1,590, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 421, డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1,538, ఓపెన్ డ్రింకింగ్ కేసులు 2,928 నమోదు చేసినట్లు తెలిపారు.

News March 7, 2026

సింగరేణి సీఎండీని కలిసిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్

image

భద్రాద్రి కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా పాల్గొన్నారు.