News June 17, 2024
వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పున:ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు బక్రీదు పండుగ కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 20, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
News December 20, 2025
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఎంపీ కావ్య

WGL కేయూలో అమలవుతున్న రూసా 2.0 (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని WGL ఎంపీ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలో ఆమె మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూసా కింద మంజూరైన రూ.50 కోట్లతో పరిశోధన కేంద్రాలు, వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్టులు, కె-హబ్, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుత గడువును మార్చి 31, 2027కు పెంచాలన్నారు.
News December 19, 2025
విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న మాక్‌డ్రిల్

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగాఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈనెల 22వ తేదీన చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టే మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు తక్షణ చర్యలపై సన్నద్ధత కోసం ఈమాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


