News July 19, 2024
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల సెలవు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 13, 2024
ములుగు జిల్లాలోనే పెద్దపులి సంచారం!
ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి బుధవారం పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడ్వాయి మండలం పంబాపూర్ సమీప అడవుల్లో పెద్దపులి పాదముద్రల గుర్తించామని రేంజర్ కోట సత్తయ్య తెలిపారు. ఓ వాగు వద్ద సంచరించినట్లు తెలిపారు. ఆ తర్వాత పాదముద్రలు కనపడలేదన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 13, 2024
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి కొండా
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పర్యాటక భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తారామతి బారాధారిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ హాజరై కార్యక్రమాలను తిలకించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
News December 12, 2024
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.