News April 4, 2025
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దన్నారు. ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 9, 2025
సంజూకు మళ్లీ నిరాశేనా!

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్
News December 9, 2025
JMKT: గత వారం లాగానే నిలకడగా పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,300, కనిష్టంగా రూ.6,600 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. మార్కెట్లో కార్యకలాపాలను చైర్ పర్సన్ స్వప్న పరిశీలించారు. పత్తి ధర శుక్రవారం లాగానే నిలకడగానే కొనసాగింది.
News December 9, 2025
మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.


