News February 15, 2025

వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

image

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేశారు.

Similar News

News March 20, 2025

బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలి: మేయర్

image

బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా బుధవారం ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బడ్జెట్ అంశాలపై మేయర్ సమీక్షించారు. అధికారులు ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండి, సభ్యులు అడిగే అంశాలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు.

News March 20, 2025

సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాల్లో వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో సమీక్ష పురోగతి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 20, 2025

వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.పివి నందకుమార్ రెడ్డి

image

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!