News April 24, 2024

వరంగల్: ఎన్నికల కోడ్.. తప్పుడు పోస్ట్‌లు పెడితే జైలుకే

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోషల్ మీడియా వేదికగా జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గుర్తించి, సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 8, 2025

వరంగల్: ZPTC, MPTC ఎన్నికలపై సన్నద్ధం!

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగనున్న నేపథ్యంలో ZPTC, MPTC ఎన్నికలపై అధికారులు ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్స్ ఆయా జిల్లాలకు చేరినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 79 ZPTC, 1075 MPTC స్థానాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఆశావహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. 

News January 8, 2025

MHBD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనాపురానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఓ బాలికను నమ్మించి బైకుపై తీసుకెళ్లి ఎంచగూడంలో అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News January 8, 2025

WGL: ఓ వైపు చైనా మాంజా.. మరో వైపు చైనా వైరస్!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు చైనా మాంజా.. మరోవైపు చైనా వైరస్‌‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల <<15024024>>జనగామలో చైనా మాంజా<<>>తో నలుగురు గాయపడ్డారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. అంతేగాక ఇప్పటికే చైనా వైరస్ hMPV ప్రభావంతో జిల్లాలో పలువురు మాస్కులు ధరిస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.