News April 24, 2024
వరంగల్: ఎన్నికల కోడ్.. తప్పుడు పోస్ట్‌లు పెడితే జైలుకే
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోషల్ మీడియా వేదికగా జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గుర్తించి, సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 26, 2025
WGL: స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం
వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు జవాన్‌లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు. స్వచ్ఛ టూల్కిట్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు వారు తగు సూచనలు చేశారు.
News January 25, 2025
మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం
గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News January 25, 2025
ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు
వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.