News September 8, 2024
వరంగల్: ఎన్పీడీసీఎల్‌లో అవినీతి నిర్మూలించడానికి శ్రీకారం
టీజీ ఎన్పీడీసీఎల్‌లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఎవరైనా లంచం అడిగితే ఉపేక్షించదని యాజమాన్యం తెలిపింది. సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సాధించామని అన్నారు. సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే 9281033233, 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్లో అన్ని కార్యాలయంలో పోస్టర్లను పెట్టడం జరిగిందన్నారు.
Similar News
News October 5, 2024
WGL: సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ‘ఎకో టూరిజం’పై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎకో టూరిజం అభివృద్ధిపై కాసేపు అధికారులతో మంత్రి చర్చించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రీయాల్, తదితరులు ఉన్నారు.
News October 5, 2024
WGL: ఒకే ఏడాది.. 3 GOVT JOBS
ఒకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఏజెన్సీకి చెందిన యువకుడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన మాదరపు అశోక్ ఎం.ఏ, బీఈడీ చదివాడు. మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పరీక్షలో ఆరో జోన్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌కు ఎంపికయ్యాడు. హాస్టల్ వార్డెన్ ఫలితాల్లోనూ ఉద్యోగం సాధించాడు.
News October 5, 2024
WGL: అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ శివారులోని హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో ఇటీవల అడవి పందిని చంపి మాంసం విక్రయిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవి పంది మాంసం విక్రయిస్తున్న రమేశ్, భీముడు, సంపత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేసి శనివారం వారికి రూ.50 వేల జరిమానా విధించారు.