News February 25, 2025

వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.

Similar News

News November 23, 2025

ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

image

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్‌లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్‌లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.

News November 23, 2025

చీరలతో మహిళల మనసు.. రిజర్వేషన్లతో రాజకీయ లెక్కలు!

image

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో సందడి నెలకొనగా, మహిళలకు దగ్గరవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లే కనిపిస్తోంది. వచ్చే నెల స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని చూసుకోవాలన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు రిజర్వేషన్ల ప్రకటన రాజకీయ సందడి పెంచి, పార్టీల్లో లెక్కలు-వ్యూహాలు మార్చే పరిస్థితి తీసుకొచ్చింది.

News November 23, 2025

రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.