News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
Similar News
News December 1, 2025
BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2025
NZB: సర్పంచి టు మినిస్టర్

కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి 1981లో కోనాపూర్ సర్పంచిగా గెలిచారు. అనంతరం ఆయన భీమ్‌గల్ పంచాయతీ సమితి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 1983 ఎన్నికల్లో TDP నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హయంలో మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.
News December 1, 2025
6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.


