News February 25, 2025

వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.

Similar News

News November 21, 2025

ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ: కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2005 మధ్యలో నమోదైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చేపట్టినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

News November 21, 2025

నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

image

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.

News November 21, 2025

BREAKING: వరంగల్: 8 మంది ఎస్ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 8 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎస్.రాజన్‌బాబు, బి.రాజేశ్ కుమార్, ఎన్.కృష్ణవేణి, నిసార్ పాషా, బి.రవీందర్, బి.విజయ్ కుమార్, ఈ.రతీశ్, వి.దిలీప్ వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు.