News May 12, 2024
వరంగల్: ఏజెన్సీలో 4 గంటల వరకే పోలింగ్

ఈనెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏజెన్సీ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని తహశీల్దార్ రమాదేవి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.
Similar News
News October 15, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్పై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.
News October 15, 2025
ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.