News February 10, 2025

వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

image

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం  తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

image

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు

News April 14, 2026

జనగణనను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చన్నారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in⁠ ద్వారా సులభంగా నమోదుచేసుకోవచ్చన్నారు.

News April 14, 2026

చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మృతి

image

చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బాణావత్ రాందాస్ మృతి చెందారు. ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తండాకు చెందిన రాందాస్.. గత మార్చి 31న భార్య కవిత (28), కుమారుడు హర్షిత్‌ను హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు తరలించబడ్డాడు. జైలులో ఉండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఈ విషయాన్ని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.