News November 20, 2024
వరంగల్: ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్న అధికారులు

వరంగల్‌లో నేడు జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక బృందాల ద్వారా టీజీఎస్ ఆర్తీసుకుంటున్న అద్దె బస్సుల ఒప్పందాన్ని ఉన్నతాధికారులు కుదుర్చుకున్నారని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలను ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ పరస్పరం మార్చుకున్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.