News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేశారు.
Similar News
News January 1, 2026
నితీశ్ ఆస్తులు: ₹1.48 కోట్ల ఫ్లాట్.. ₹11.32 లక్షల కారు

బిహార్ CM నితీశ్ కుమార్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు 2025 చివరి రోజు నాటికి వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు. నితీశ్ చేతిలో ₹20,552 నగదు, మూడు బ్యాంక్ అకౌంట్లలో కలిపి ₹57,766 అమౌంట్ ఉంది. ₹2.03 లక్షల విలువ చేసే జువెలరీ, ₹11.32 లక్షల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఆస్తుల లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం ఆయన చరాస్తుల విలువ ₹17,66,196. అలాగే ₹1.48 కోట్ల మార్కెట్ విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది.
News January 1, 2026
VJA: నూతన సంవత్సర వేడుకల బందోబస్తు పర్యవేక్షించిన సీపీ

నూతన సంవత్సర వేడుకల బందోబస్తును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు స్వయంగా పర్యవేక్షించారు. అర్ధరాత్రి నుంచి విధుల్లో ఉన్న ఆయన, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో
డీసీపీలు కృష్ణ కాంత్ పటేల్, షరీనా బేగం, ఎస్.వి.డి. ప్రసాద్, డీసీపీలు, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


