News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేశారు.
Similar News
News March 19, 2025
ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News March 19, 2025
అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.
News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,