News March 1, 2025

వరంగల్ కమిషనర్ WARNING

image

నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోకపోతే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను హెచ్చరించారు. శుక్రవారం హెడ్ ఆఫీస్‌లో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై ఆర్ఐలతో కమిషనర్ సమీక్షించారు. ఇప్పటివరకు జరిపిన వసూళ్ల పురోగతిని ఆర్ఐల వారీగా రివ్యూ నిర్వహించి, ఇటీవల సీడీఎంఏ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి వార్డ్ ఆఫీసర్ నుంచి అదనపు కమిషనర్ వరకు సూచించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

Similar News

News March 1, 2025

ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

image

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్‌ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.

News March 1, 2025

ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షకు 958 మంది గైర్హాజ‌రు

image

శనివారం తొలిరోజు జరిగిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష ప్ర‌శాంతంగా జ‌రిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ ప‌రీక్ష‌కు 40,695 మందికి గాను 39,737 మంది హాజ‌ర‌య్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజ‌ర‌య్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాల‌తో పాటు ప‌లు సిటింగ్ స్క్వాడ్ స్ విధుల్లో పాల్గొన్నాయి.

News March 1, 2025

ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

image

మార్చి నెలలో టాలీవుడ్‌లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

error: Content is protected !!