News April 3, 2024
వరంగల్: కాంగ్రెస్ నుంచి బక్క జడ్సన్ సస్పెండ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత సస్పెండ్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
దుగ్గొండి: భూ సమస్యల పరిష్కరానికే ‘భూ భారతి చట్టం’

రైతులు, ప్రజలు ఏళ్లుగా పడుతున్న భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి రైతు వేదికలో భూ భారతి చట్టంపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రజా పాలనలో అనేక సంక్షేమ పథకాలతో పాటు, ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ సత్య శారద, అధికారులు తదితరులున్నారు.
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.
News April 19, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.