News July 23, 2024
వరంగల్: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు!

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడుతుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌కు మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 19, 2025
వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.
News November 19, 2025
పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పంపిణీని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోగా, పట్టణాల్లో మార్చి 1-8 మధ్య పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు.
News November 16, 2025
WGL: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


