News October 19, 2024
వరంగల్: కొడుకు పుట్టినరోజు నాడే తండ్రి మృతి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం కరెంట్ షాక్‌తో <<14392836>>రైతు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కల్లెడ గ్రామానికి చెందిన బాల్లె కుమారస్వామి, సునీత దంపతులకు ప్రవళిక, మానస, సుశాంత్ సంతానం. అయితే నిన్న కొడుకు పుట్టినరోజు కావడంతో సాయంత్రం వేడుకలు ఘనంగా చేద్దామనుకున్నాడు. ఈక్రమంలో పొలానికి నీరు పెట్టి వద్దామనుకునేలోపే కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఎంతకూ ఇంటికి రాపోవడంతో భార్య పొలానికి వెళ్లిచూడగా మృతి చెందాడు.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.