News January 10, 2026
వరంగల్ కొత్త కలెక్టరేట్‌లో గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం!

వరంగల్‌లో ప్రారంభానికి సిద్ధమైన కలెక్టర్ కార్యాలయం గ్రేటర్ WGL కార్పొరేషన్‌కు కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రకటించిన క్రమంలో వరంగల్-హనుమకొండ జిల్లాలను ఒకటి చేసే అవకాశం ఉంది. రెండు జిల్లాల్లో ఒకటి చేయాలని పౌర సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తున్న క్రమంలో రెండు జిల్లాలను ఒకటి చేసి కొత్త కలెక్టరేట్‌ను బల్దియాకు కేటాయించనున్నట్లు సమాచారం.
Similar News
News January 19, 2026
సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!
News January 19, 2026
NZB: సంక్రాంతి ఎఫెక్ట్.. రూ. 27.89 కోట్ల మద్యం విక్రయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పండుగ సందర్భంగా రూ. 27.89 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 151 వైన్స్‌లు, 29 బార్ల యజమానులు పండుగను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి మాక్లూర్ మండలంలోని IML డిపో నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ నెల 12న రూ. 7.62 కోట్లు, 13న రూ. 4.82 కోట్లు, 14న రూ.6.87 కోట్లు, 16న రూ. 8.08 కోట్ల మద్యాన్ని కొన్నారు.
News January 19, 2026
24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.


