News March 7, 2025

వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ నేపథ్యం ఇదే..!

image

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్ ప్రీత్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, యూనవర్సిటీలో బంగారు పతకం సాధించారు. పీఎస్‌యూలో ప్రభుత్వ రంగ సంస్థల పని చేశారు. అదే సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. HYD ఎల్బీనగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా, సూర్యాపేట ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. శుక్రవారం ఆయన్ను ప్రభుత్వం వరంగల్ సీపీగా బాధ్యతలు అప్పగించింది.

Similar News

News December 2, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

☛ HYD ఓల్డ్ సిటీతో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ మహిళల భద్రత, సామాజిక సాధికారతలో భాగంగా 20 మంది ట్రాన్స్‌జెండర్లను HYD మెట్రో సెక్యూరిటీలో సిబ్బందిగా నియమించినట్లు CMO అధికారి జాకబ్ రోస్ ట్వీట్.
☛ రాష్ట్రంలో 2 నెలల్లో AI యూనివర్సిటీ సేవలు. లీడింగ్ గ్లోబల్ యూనివర్సిటీల సహాకారంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.

News December 2, 2025

సీఎం పర్యటనకు 900 మందితో పోలీస్ భద్రత

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఒక అదనపు ఎస్పీ, డీఎస్పీ-5, సీఐలు-30, ఎస్సైలు-62, ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు -300, హోంగార్డులు-160, 7 స్పెషల్ పార్టీలు, 2 ఏఆర్ ప్లాటున్లు మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు.

News December 2, 2025

తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

image

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.