News March 7, 2025
వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ నేపథ్యం ఇదే..!

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్ ప్రీత్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, యూనవర్సిటీలో బంగారు పతకం సాధించారు. పీఎస్‌యూలో ప్రభుత్వ రంగ సంస్థల పని చేశారు. అదే సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. HYD ఎల్బీనగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా, సూర్యాపేట ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. శుక్రవారం ఆయన్ను ప్రభుత్వం వరంగల్ సీపీగా బాధ్యతలు అప్పగించింది.
Similar News
News January 25, 2026
నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కిరణ్ పర్యటన

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం చంద్రగిరి మండలం మామండూరులోని శ్రీదేవి రెడ్డి గార్డెన్స్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం మామండూరులో ఎం.వెంకటరెడ్డి నివాసంలో కాసేపు బస చేసి, స్థానిక నేతలతో ముచ్చటించనున్నారు. అక్కడి నుంచి నేరుగా అన్నమయ్య జిల్లాలోని తన స్వగ్రామమైన కలికిరికి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.
News January 25, 2026
కాకినాడ: పవన్ కళ్యాణ్ కొడుకుపై AI వీడియో.. HYD వ్యక్తి అరెస్ట్!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్‌పై AIతో తప్పుడు వీడియో రూపొందించిన వ్యక్తిని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ బి.పెద్దిరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వెంకటరమణ AIతో వీడియోలు చేస్తున్నాడు. అనుమతి లేకుండా అకీరానందన్‌పై ‘లవ్ స్టోరీ’ పేరుతో వీడియోను సృష్టించి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. జనసేన నేత తాటికాయల వీరబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News January 25, 2026
నంద్యాల జిల్లాలో నేటి చికెన్ ధరలు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. నంద్యాల, జూపాడుబంగ్లా, గడివేముల, బనగానపల్లె, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.220, స్కిన్‌లెస్ రూ.240-280 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.


