News March 7, 2025
వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ నేపథ్యం ఇదే..!

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్ ప్రీత్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, యూనవర్సిటీలో బంగారు పతకం సాధించారు. పీఎస్‌యూలో ప్రభుత్వ రంగ సంస్థల పని చేశారు. అదే సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. HYD ఎల్బీనగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా, సూర్యాపేట ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. శుక్రవారం ఆయన్ను ప్రభుత్వం వరంగల్ సీపీగా బాధ్యతలు అప్పగించింది.
Similar News
News March 17, 2026
ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలి: కలెక్టర్

బాపట్లలో సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఎంజిఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వెనుకబడిన మండల అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంఏవై పథకంలోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.
News March 17, 2026
పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారం

గరుగుబిల్లి మండలం తోటపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న పంట పొలాలలో ఏనుగులు గుంపు సోమవారం సాయంత్రం సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణం ఏనుగుల గుంపును ఈ ప్రాంతాల నుంచి తరలించాలని రైతుల కోరుతున్నారు.
News March 17, 2026
ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.


