News February 13, 2025
వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 19, 2025
నేడు ఢిల్లీకి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30కి జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఎన్డీయే పెద్దలు ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎంచుకోనున్నారు. ఎవరి పేరును ప్రకటిస్తారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది.
News February 19, 2025
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.