News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News July 6, 2025

కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

image

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News July 6, 2025

సిరిసిల్ల: IIITకి 24 మంది విద్యార్థులు ఎంపిక

image

గంభీరావుపేట మండలంలో 24 మంది విద్యార్థులు బాసర IIITకి ఎంపికైనట్లు మండల విద్యాధికారి సంటి గంగారం తెలిపారు. మండలంలోని లింగన్నపేట, మల్లారెడ్డిపేట, సముద్ర లింగాపూర్, దమ్మన్నపేట, కొత్తపల్లి, గజ సింగవరం, ముచర్ల, నాగంపేట గ్రామాలకు చెందిన ZPHS విద్యార్థులు బాసర IIITలో సీట్లు సాధించారన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 6, 2025

అనకాపల్లి: యువతకు కువైట్‌లో ఉద్యోగ అవకాశాలు

image

అనకాపల్లి జిల్లాలో యువతకు కువైట్‌లోని నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.గోవిందరావు శనివారం తెలిపారు. ఐటీఐ, డిప్లొమా చదివి సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ పనిలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండి 25 నుంచి 50 ఏళ్ల వయసు గలవారు అర్హులుగా పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీలోగా www.naipunyam.apgov.inలో నమోదు చేసుకోవాలన్నారు.