News November 13, 2024
వరంగల్: కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
వరంగల్ న్యూ శాయంపేటలోని దోణగుట్ట శ్రీ త్రివేదాద్రి సంతోష లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం కోటి దీపోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, దీప ప్రమిదను వెలిగించిన కొండా సురేఖ.
Similar News
News December 10, 2024
వరంగల్: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.
News December 10, 2024
వరంగల్: విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
News December 9, 2024
సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ
హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.