News January 24, 2025
వరంగల్: క్రమంగా తగ్గుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం రూ.7,220 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,200, బుధవారం రూ.7,210 అయింది. నిన్న భారీగా తగ్గి రూ.7,135కి చేరిన పత్తి ధర నేడు రూ.7120కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ధరలు మళ్లీ తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 9, 2025
కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి

విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పద్మావతి నియమితులయ్యారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఇందులో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పద్మావతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News November 9, 2025
BIGG BOSS: ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

బిగ్బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌజ్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ ఫేమ్ శ్రీనివాస సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌజ్లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్-5కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది.
News November 9, 2025
గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


