News April 9, 2025
వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News January 5, 2026
గార్డెన్లో మొక్కలకు చీడలు తగ్గాలంటే..

చలికాలంలో సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు చీడలు ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే నాలుగు చెంచాల వంటసోడా, ఎక్కువ గాఢతలేని సోప్ పౌడర్ ఓ చెంచా తీసుకుని అయిదులీటర్ల నీటిలో వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై చల్లితే తిరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి చల్లితే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
News January 5, 2026
ఆధారాల్లేవ్.. ఆ డివైజ్ కొనొద్దు: AIIMS డాక్టర్

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ధరించిన బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని AIIMS వైద్యుడు దత్తా అభిప్రాయపడ్డారు. బిలియనీర్లు డబ్బు వృథా చేసే ఇలాంటి ఖరీదైన బొమ్మలను కొనొద్దని సూచించారు. ఇది హార్ట్ ఎటాక్స్‌ను ముందే గుర్తిస్తుందని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కేవలం ‘cfPWV’ మార్కర్ ద్వారానే గుండె సంబంధిత మరణాలను శాస్త్రీయంగా అంచనా వేయగలమని స్పష్టం చేశారు.
News January 5, 2026
పొద్దు తిరుగుడులో బోరాన్ లోపం – నివారణ

పొద్దుతిరుగుడు పంటకు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. పంట పూత దశలో బోరాన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే మొక్కల లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


