News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News October 20, 2025

గొర్రెల్లో ప్రమాదం.. బొబ్బ రోగం(అమ్మతల్లి)

image

బొబ్బరోగం ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News October 20, 2025

దీపావళి: లక్ష్మీ పూజ విధానం (2/2)

image

అమ్మవారికి ఇష్టమైన ఎర్ర మందారం, తామర, గులాబీ వంటి పుష్పాలతో పూజ చేయాలి. పాయసం, లడ్డూ వంటి తీపి నైవేద్యాలను సమర్పించాలి. కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ తులసీ దళాలతో ప్రత్యేక పూజ చేయాలి. నూనె, నెయ్యి దీపాలు వెలిగించి, కర్పూర హారతి ఇవ్వాలి. పూజ ముగిశాక, కుటుంబమంతా కలిసి ఇంట్లోని ప్రతి మూలలో దీపాలు వెలిగించి, లక్ష్మీ కథలు పారాయణం చేయాలి. ఈ సంప్రదాయం సంపద, శాంతిని ఇంట్లో స్థిరంగా ఉండేలా చేస్తుంది.

News October 20, 2025

త్వరలో వారికి ప్రత్యేక పింఛన్లు: మంత్రి కందుల

image

AP: రాష్ట్రంలోకి కళాకారులందరికీ త్వరలోనే ప్రత్యేక పింఛన్లను తిరిగి అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి ఉగాది, కళారత్న పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు.