News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News February 17, 2025

వరంగల్‌లో “ది స్వయంవర్”

image

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.

News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గత శుక్రవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి శుక్రవారం రూ.15,500 ధర రాగా.. ఈరోజు రూ. 16వేలు పలికింది. మరోవైపు 341 మిర్చికి మొన్న రూ.13,600 ధర రాగా.. ఈరోజు రూ.13,500 అయింది.

News February 17, 2025

గైర్హాజరైన విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులకు మరొక అవకాశంగా ప్రత్యేక బ్యాచ్ ప్రయోగ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. మూడు విడుతల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పలువురు విద్యార్థులు అనారోగ్య, తదితర కారణాల వల్ల గైర్హాజరయ్యారని, వారందరికీ ప్రత్యేక బ్యాచ్‌గా స్థానిక ఏవీవీ జూ.కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!