News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News November 28, 2025
మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.
News November 28, 2025
MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.
News November 28, 2025
వనపర్తిలో 780 వార్డులకు 276 నామినేషన్లు

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని మొత్తం 780 వార్డులకు రెండు రోజుల్లో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 250 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు:
ఘనపూర్: 90
పెద్దమందడి: 83
రేవల్లి: 51
గోపాల్పేట: 19
ఏదుల: 07


