News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News November 15, 2025

రెబ్బెన: యాక్సిడెంట్.. కానిస్టేబుల్ మృతి

image

రెబ్బెన మండలం కైరిగాం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిర్యానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ రాము శనివారం ఉదయం మృతి చెందినట్లు రెబ్బెన SI వెంకటకృష్ణ తెలిపారు. ఈ నెల 13న కైరిగాం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాము తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు SI వెల్లడించారు.

News November 15, 2025

యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News November 15, 2025

తెలంగాణ హైకోర్టు వెబ్‎సైట్ హ్యాక్

image

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‎లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్‎సైట్‎లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.