News February 7, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే పత్తి ధర ఈరోజు రూ.10 పెరిగింది. గురువారం రూ.6,970 పలికిన పత్తి ధర.. నేడు రూ.6,980 చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం మొదటి నుంచి క్రమంగా పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7 వేలు మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,980, గురువారం రూ.6,970 పలికాయి.
Similar News
News October 16, 2025
రేపు గుంతకల్లుకు సినీ తారలు

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
News October 16, 2025
బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.
News October 16, 2025
ADB: కొత్తవారికే హస్తం పగ్గాలు..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తుండటంతో, పదవుల్లో కొనసాగుతున్న పాత నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్గ పోరు, ఆశావహుల సంఖ్య పెరగడంతో ఏకాభిప్రాయం కష్టంగా మారింది. ఈ అంశంపై ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటిస్తూ, నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు.