News February 19, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,810

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు సైతం పత్తి ధర అన్నదాతకు నిరాశే మిగిల్చింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు రూ.10 పెరిగి, రూ.6,810కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారాలు చెబుతున్నారు. 

Similar News

News March 12, 2025

పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

image

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

News March 12, 2025

గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

image

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

News March 12, 2025

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా కవిత

image

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!