News February 25, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6900

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.10 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,890 ధర పలకగా.. నేడు రూ.6900 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Similar News

News February 25, 2025

వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ 

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో వరంగల్ రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కేంద్రాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ చేపట్టాల్సిన బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై డీసీపీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు.

News February 25, 2025

డయాబెటిస్ పేషెంట్స్ ఈ టిప్స్ ట్రై చేయండి

image

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని టిప్స్ సూచించారు.1.గ్లాస్ వేడి నీటిలో టేబుల్‌ స్పూన్ ఆపిల్ వెనిగర్‌ను వేసుకొని తాగండి. 2 చియా గింజలను నీటిలో నానబెట్టి తాగండి. 3. దోసకాయ ముక్కల్నినిమ్మరసంతో కలిపి తినండి 4.ఆకుకూరల సలాడ్ తీసుకోండి. 5. కొన్ని వాల్‌నట్స్, బాదం తినండి . 6 గ్లాసు నీటిలో దాల్చిన చెక్క నానబెట్టి తాగండి. వీటిని ఫాలో అయ్యి మీ డయాబెటిస్‌ కంట్రోల్ ఉంచుకోండి.

News February 25, 2025

మహిళలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

image

మహిళలకు అండగా “సఖి వన్ స్టాప్ సెంటర్” ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న”సఖి వన్ స్టాప్ సెంటర్”ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సెంటర్‌లోని కేంద్ర నిర్వాహణ గది, పోలీస్ సలహాదారు గది, రెసెప్షన్, తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ రూమ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.

error: Content is protected !!