News September 12, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 7790

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800 అయింది. ఈరోజు రూ.10 తగ్గి, రూ.7790కి చేరింది. వర్షాకాలం నేపథ్యంలో రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్ కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News February 25, 2026

వరంగల్‌: రాయితీలపై పనిముట్లు అందజేత

image

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్‌నెట్‌లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

News February 24, 2026

వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.