News September 19, 2024
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,850

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. నేడు కొంత పెరిగి రూ. 7850 అయిందని వ్యాపారులు తెలిపారు. పత్తి ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. .
Similar News
News November 19, 2025
వరంగల్ కలెక్టర్కు మంత్రి పొంగులేటి అభినందనలు

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.
News November 19, 2025
పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పంపిణీని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోగా, పట్టణాల్లో మార్చి 1-8 మధ్య పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు.
News November 16, 2025
WGL: ప్రత్యేక లోక్ అదాలత్లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


