News September 19, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,850

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. నేడు కొంత పెరిగి రూ. 7850 అయిందని వ్యాపారులు తెలిపారు. పత్తి ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. .

Similar News

News October 10, 2024

తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ : మంత్రి సురేఖ

image

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంత్రి సురేఖ తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూల రూపంలోని ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానముందన్నారు.

News October 9, 2024

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం వర్గీకరణ అమలు, బీసీ కులగణనకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News October 9, 2024

నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క

image

హైదరాబాదులో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.