News October 24, 2024

వరంగల్: క్వింటా మొక్కజొన్న ధర రూ. 2,555

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలకగా.. మంగళవారం రూ.2,535కి చేరింది. నిన్న (బుధవారం) రూ.2,565 వచ్చిన మక్కలు ధర నేడు రూ. 2,555కి తగ్గింది. రెండు నెలల క్రితం వరకు రూ.3,000కు పైగా పలికిన మొక్కజొన్న ధర పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 7, 2024

సిద్దేశ్వర స్వామి వారికి సంధ్యా దీపాలంకరణ

image

హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో కార్తీక మాసం గురువారం ఆలయ అర్చకులు శ్రీ సిద్దేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంకాలం సిద్దేశ్వర స్వామి వారికి సంధ్యా దీపాలంకరణ అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2024

వరంగల్: ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంపకం.. వ్యక్తి అరెస్ట్

image

ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. వరంగల్ శివనగర్‌కు చెందిన కుమార్(60) సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఇంటి మేడపై ఓ గృహపరిశ్రమ తరహాలో పూల కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. యాంటీ డ్రగ్స్ టీం మత్తు పదార్థాలను పసిగట్టే పోలీసు జాగిలంతో గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News November 7, 2024

నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలి: వరంగల్ సీపీ

image

పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం శాయంపేట పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. కాగా, కమిషనర్‌కు పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.