News April 28, 2024

వరంగల్: గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌కు గాయాలు

image

వరంగల్‌లోని ఎనుమాముల EVM స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద విధులు పోలీస్ గన్ మిస్ ఫైరయ్యింది. గార్డ్ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాకేశ్ గన్ మిస్ ఫైర్ కావడంతో ఎడమకాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. హుటాహుటినా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజేశ్‌కు MGMలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు వివరించారు.

Similar News

News November 2, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: వర్ధన్నపేటలో కొండచిలువ కలకలం > BHPL: పోగొట్టుకున్న ఫోన్ ను తిరిగి అప్పగించిన ఎస్సై> MHBD: ఇంట్లో క్షుద్ర పూజల కలకలం > BHPL: గణపురం మండలంలో దొంగల బీభత్సం> WGL: వర్ధన్నపేటలో దొంగల బీభత్సం> MLG: బైక్ అదుపు తప్పి దంపతులకు గాయాలు> WGL: భద్రకాళి ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య!> HNK: మూడు వరుసల బీటీ రోడ్డు.. వాహనదారుల ఇబ్బందులు

News November 1, 2024

వర్ధన్నపేట‌లో కొండ చిలువ కలకలం

image

వర్ధన్నపేట‌లోని నీరటి సమ్మయ్య ఇంటి పరిసరాలలో కొండ చిలువ కలకలం రేపింది. గమనించిన కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పట్టుకుని పట్టణ కేంద్రానికి దూరంలో జనసంచారం లేని ప్రదేశంలో వదిలేశారు.

News November 1, 2024

MHBD: ఇంట్లో క్షుద్ర పూజల కలకలం

image

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. ఉగ్గంపల్లి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో నిన్న పండుగ సందర్భంగా ఎవరూలేని సమయం చూసి క్షుద్ర పూజలు చేశారు. ఇలా ఇంట్లోనే క్షుద్ర పూజలు చేయడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే క్షుద్ర పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.