News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News February 14, 2025
విశ్వక్‌సేన్ ‘లైలా’ రివ్యూ

బ్యూటీపార్లర్ నడుపుకునే హీరో ఓ కేసులో చిక్కుకోవడం, బయటపడేందుకు ఏం చేశాడనేదే ‘లైలా’ స్టోరీ. విశ్వక్‌సేన్ లేడీ గెటప్, అక్కడక్కడా కామెడీ సీన్లు కొంత వరకు ఫర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ సక్సెస్ కాలేకపోయారు. సెంటిమెంట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా మెప్పించలేకపోయాయి.
RATING: 1.75/5
News February 14, 2025
నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
News February 14, 2025
సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.