News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

Similar News

News November 19, 2025

KNR: SRR కాలేజీ పీజీ ఫలితాలు విడుదల

image

స్థానిక ఎస్సార్ఆర్ ప్రభుత్వ కళాశాల పీజీ 2వ, 4వ సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపల్ కె.రామకృష్ణ బుధవారం విడుదల చేశారు. అటానమస్ హోదాలో రెండవ బ్యాచ్ పీజీ ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫలితాల్లో 2వ సెమిస్టర్‌లో 77 శాతం, 4వ సెమిస్టర్‌లో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను exambranch.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.

News November 19, 2025

ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయి ఉన్న ఇంటిని కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జలజా కుమారి పాల్గొన్నారు.

News November 19, 2025

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం సరిపోయిన ధాన్యాన్ని నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన తుర్కపల్లి మండలం పెద్దతండ, ములకలపల్లి గ్రామాల్లో గల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.