News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News February 20, 2025
మెదక్: ఢిల్లీ UPSCకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం

మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. మయూడి అనిల్ కుమార్ (28) ఈనెల 7న ఢిల్లీలో యుపీఎస్సీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. 11న కుటుంబీకులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతడి కోసం ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సోదరుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 20, 2025
మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 20, 2025
నేడే టీమ్ ఇండియా తొలి సమరం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉన్న భారత్‌కు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అటువైపున్నది బంగ్లాయే అయినా తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది.