News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

Similar News

News February 8, 2026

నల్గొండ నగర పాలిక.. తొలి ఏలిక ఎవరో

image

నల్గొండ కార్పొరేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1951లో 12 వార్డులతో గ్రేడ్‌-3 మున్సిపాలిటీ కాగా.. ఈ ఏడాది 48 డివిజన్లతో కార్పొరేషన్‌గా అవతరించింది. తొలిసారిగా జరుగుతున్న నగరపాలిక ఎన్నికల్లో మేయర్‌ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. నగరంపై పట్టుసాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. తొలి మేయర్ ఎవరో వేచి చూడాల్సిందే.

News February 8, 2026

కొత్తగూడెం: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులు

image

కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. పోలింగ్‌, సహాయక సిబ్బంది ఉత్సాహంగా ఓటు వేశారు. నేటి సాయంత్రం వరకు ఈ అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు. విధుల్లో ఉండి ఓటుకు దూరం కాకుండా సిబ్బంది ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News February 8, 2026

KNR: ముగింపు దశకు పుర పోరు.. హోరెత్తుతున్న ప్రచారం!

image

ఉమ్మడి KNRజిల్లాలోని మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. సోమవారం సా.5గంటలకు ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర స్థాయి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు,ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా మారింది.