News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News November 12, 2025
జల సంరక్షణలో జనగామకు రూ.కోటి నజరానా..!

జన భాగస్వామ్యంతో జల సంరక్షణలో అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను జనగామ జిల్లాకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గతేడాది 2024 ఏప్రిల్ నుంచి 30,569 ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టినందుకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈనెల 18న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నజరానా అందుకోనున్నారు.
News November 12, 2025
గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.
News November 12, 2025
గుత్తిలో వ్యక్తి మృతి

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


